ప్రధాని మోదీ కామెంట్స్.. భారత్‌లో సోషల్ మీడియా బ్యాన్?

కలం, వెబ్ డెస్క్ : భారత్‌లో మైనర్ల సోషల్ మీడియా వినియోగంపై త్వరలోనే కీలక నిర్ణయం రాబోతుందా? 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా (India Social Media Ban) కేంద్రం బ్రేక్ వేయనుందా? అంటే.. అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. ఆస్ట్రేలియాలో పర్యటించిన ప్రధాని మోదీ (PM Modi) అక్కడి ప్రభుత్వం ఇటీవల మైనర్ల భద్రత కోసం తీసుకొచ్చిన సోషల్ మీడియా నిషేధ చట్టాన్ని ప్రధాని మోదీ ప్రశంసించడం తాజా ఊహాగానాలకు ఊతం ఇస్తోంది.

సమాజ రక్షణ కోసం సోషల్ మీడియా యొక్క దుష్ప్రభావాల నుంచి సమాజాన్ని, ముఖ్యంగా భావితరాలను రక్షించడానికి ఆస్ట్రేలియా తీసుకున్న ఈ నిర్ణయం అద్భుతమైనదని ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ చట్టం భారత్‌తో పాటు మిగతా ప్రపంచ దేశాలు కూడా అనుసరించదగ్గ ఒక గొప్ప ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. తాము కూడా ఆస్ట్రేలియా నుంచి పాఠాలు గ్రహిస్తున్నామని ప్రధాని మోదీ అనడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే దేశంలో చిన్న పిల్లలకు సోషల్ మీడియాకు బానిసలవుతున్నారనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఆస్ట్రేలియా తరహాలో భారత్‌లోనూ మైనర్లకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించవచ్చంటూ నెట్టింట జోరుగా సాగుతోంది. ఈ తరుణంలోనే ప్రధాని మోదీ మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్ పై హింట్ ఇచ్చారని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>