చర్మ సౌందర్యానికి హాట్ ప్యాక్.. ముఖ కాంతిని పెంచే సింపుల్ టిప్

కలం, వెబ్‌డెస్క్: నేటి డిజటల్ యుగంలో యువత చర్మ సౌందర్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలనే ఆరాటంతో ఖరీదైన క్రీములు వాడుతుంటారు, తరచూ ఫేషియల్స్ చేయించుకుంటారు, రకరకాల ఫేస్ ప్యాక్స్ ట్రై చేస్తుంటారు. చర్మంపై నల్లటి మచ్చలు, మొటిమలను తగ్గించుకోవాడానికి ఐస్ క్యూబ్స్ లేదా కోల్డ్ ప్యాక్స్ వాడటం కూడా మనకు తెలిసిందే.

అయితే, చర్మ సౌందర్యాన్ని, ముఖ వర్చస్సును సహజంగా పెంచడానికి ‘హాట్ ప్యాక్’ లేదా ‘ఫేషియల్ స్టీమింగ్’ అంటే ముఖానికి ఆవిరి పట్టడం (Facial Steaming Benefits) కూడా ఎంతో అద్భుతంగా పనిచేస్తుందని మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే మాత్రం… మీరు ‘హాట్ కంప్రెస్’ లేదా ‘వార్మ్ టవల్ ట్రీట్మెంట్’ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే, ప్రస్తుత బ్యూటీ వరల్డ్ లో ఇప్పుడిదే లేటెస్ట్ ట్రెండ్ అని చెప్పుకోవచ్చు.

చాలామంది దీనిని పట్టించుకోరు కానీ, ముఖానికి వేడి ఆవిరి లేదా హాట్ ప్యాక్ అందించినపుడు చర్మ రంధ్రాలు తెరుచుకుని, లోపల పేరుకుపోయిన మురికి, జిడ్డు సులభంగా తొలగిపోతాయి. ఇది ముఖంలో రక్తప్రసరణను పెంచి, చర్మానికి సహజమైన గ్లోను అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు.

అందుకే ఈసారి ఫేస్ వాష్ చేసుకునే ముందు శుభ్రమైన మెత్తని టవల్ ను గోరువెచ్చని నీటిలో ముంచి తీయండి. ఇప్పుడు నీటిని పిండేసి నిమిషం పాటు ముఖంపై టవల్ ను ఉంచండి. ఈ పద్ధతి వల్ల చర్మరంధ్రాల్లోని మలినాలు సులభంగా బయటకు వచ్చేస్తాయి. అంతేకాకుండా మేకప్ చేసుకునే ముందు ఇలా చేయడం వల్ల స్కిన్ మృదువుగా మారుతుంది. అప్పుడు మేకప్ నాచురల్ గా కనిపిస్తుంది.

అంతే కాకుండా కళ్ల అలసట తగ్గించడంలోనూ ఈ హాట్ ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది. రోజంతా డిజిటల్ స్క్రీన్ ముందు కూర్చునే వారు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని కాటన్ ప్యాక్ ను కళ్లపై ఉంచండి. దీనివల్ల కళ్ల అలసట, కళ్ల కింద వాపులు తగ్గుతాయి. అయితే హాట్ ప్యాక్ ను వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. గోరువెచ్చని టవల్‌ను మాత్రమే ఉపయోగించాలి. హాట్ ప్యాక్‌ను నేరుగా కాకుండా శుభ్రమైన, మెత్తని కాటన్ వస్త్రంలో చుట్టి చర్మానికి తగిలేలా చూసుకోవడం ముఖ్యం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>