కలం, వెబ్ డెస్క్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు (Cyber Scam) తెరలేపారు. ఈ ప్రక్రియ పేరుతో అమాయకుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కొల్లగొడుతున్నట్లు పోలీసులు ప్రజలను హెచ్చరించారు. సాధారణంగా బూత్ లెవెల్ ఆఫీసర్ల (BLO) పేరుతో ఫోన్ కాల్స్ చేస్తూ, వివరాల అప్‌డేట్ కోసమంటూ ఒటిపి (OTP)లు అడుగుతూ ఖాతాలను ఖాళీ చేస్తున్నారని తెలిపారు.
అంతేకాకుండా, వాట్సాప్ వేదికగా చివరన ‘సర్’ (apk లేదా ఇతర ప్రమాదకర ఫైల్స్) అని ముగిసే అనుమానాస్పద లింకులు, ఫైళ్లను పంపుతూ ఫోన్లను హ్యాక్ చేస్తున్నట్లు గుర్తించారు. ఎన్నికల గుర్తింపు కార్డుల సవరణకు సంబంధించి ఎలాంటి ఓటిపిలు ఎవరికీ చెప్పవద్దని, వాట్సాప్‌లో వచ్చే తెలియని ఫైళ్లను డౌన్‌లోడ్ చేయవద్దని పోలీసులు స్పష్టం చేశారు. ఒకవేళ ఇలాంటి మోసాల బారిన పడితే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

