Mobile Popup Ad
Mobile Popup Ad

కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని బద్దెనపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని (Paddy Procurement) ఆయన పరిశీలించి మాట్లాడారు. నెల రోజుల నుంచి వడ్లు తీసుకొస్తుంటే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క గింజ కొన్న పాపాన పోలేదని దుయ్యబట్టారు. రైస్ మిల్ కేటాయించకపోతే ఎవరు కొనాలి? ఎలా తూకం వేయాలి? అని ప్రశ్నించారు. వడ్లు కొంటే మద్దతు ధర ఇవ్వాలని.. అలాగే బోనస్ సైతం ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం కొనటం లేదని మండిపడ్డారు. దళారులకు అప్పగిస్తే వాళ్ళు కమీషన్ ఇస్తారని.. అందుకే వదిలేశారని ఫైర్ అయ్యారు. ఈ మోసపూరిత ప్రభుత్వం రైతు బంధు ఇవ్వదని అన్నారు.

సిరిసిల్లలో 1000 క్వింటాళ్లు కూడా ప్రభుత్వం కొనలేదని.. రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షం పడి ధాన్యం తడిసిపోతుందని టార్పాలిన్ కవర్ కొని కప్పుకుంటున్నారని చెప్పారు. తమది రైతు ప్రభుత్వం అని రాహుల్ గాంధీ చెప్తున్నారని.. ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఎక్కడా లేదని విమర్శించారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇంత దరిద్రపు పాలన చూడలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని.. లేదంటే తాము రోడ్డెక్కుతామని హెచ్చరించారు. రెండేళ్లలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని.. ఆ తరవాత రైతును కంటికి రెప్పల కాపాడుకుంటామని ఆయన (KTR) చెప్పారు. తాను సిరిసిల్ల వస్తుంటే కనీసం ఒక్క అధికారి కూడా లేడని చెప్పారు.

Read Also: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ఏకైక బలమైన శక్తి బీజేపీ: రామ్‌చందర్ రావు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>