ఢిల్లీలో ప్రశాంతత.. మెట్రో రైళ్లు తిరిగి ప్రారంభం

కలం, వెబ్ డెస్క్: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో కోక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) జంతర్‌మంతర్ వద్ద తలపెట్టిన నిరసన కార్యక్రమాలను అధికారికంగా విరమించుకుంది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. నిరసనల కారణంగా భద్రతా చర్యల్లో భాగంగా మూసివేసిన అన్ని మెట్రో స్టేషన్‌ల ప్రవేశ ద్వారాలను తిరిగి తెరిచినట్లు ఢిల్లీ మెట్రో (Delhi Metro) రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) వెల్లడించింది. రాజీవ్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ సహా మొత్తం 16 కీలక స్టేషన్‌లలో విధించిన తాత్కాలిక ఆంక్షలను ఎత్తివేయడంతో మెట్రో రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>