మణిపుర్ లో మళ్లీ హింస.. సీఎం ఇంటి ముట్టడి

కలం, వెబ్ డెస్క్: మణిపుర్ రాష్ట్రంలో (Manipur) మరోసారి హింస చెలరేగింది. కుకీ, మెయితీ తెగల మధ్య ఘర్షణలు చోటు చేసుకోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు సీఎం ఖేమ్ చంద్ ఇంటి ముట్టడికి యత్నించగా.. భద్రత బలగాలు అడ్డుకున్నాయి. వారిపై రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించగా కొందరు గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ ఆందోళనలు మాత్రం ఇంకా సద్దుమణగలేదు. ముందు జాగ్రత్త చర్యగా అదనపు బలగాలను రంగంలోకి దించారు.

హింసకు ముగింపు ఎప్పుడు..?

కుకీ, మెయితీ తెగల మధ్య 2023 మే నెలలో మొదలైన ఘర్షణలు తీవ్ర రూపం దాల్చి వందల సంఖ్యలో ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయి. జులై నెలలో ఇద్దరు మహిళలను ఆందోళనకారులు వివస్త్రను చేసి ఊరేగించిన వీడియోలు చూసి.. దేశ ప్రజలు షాక్ కు గురయ్యారు. అప్పటి సీఎం బీరేన్ సింగ్ పై తీవ్ర విమర్శలు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఆయనతో రాజీనామా చేయించి.. కొన్నాళ్లు రాష్ట్రపతి పాలన విధించింది. గతేడాది ఖేమ్ చంద్ ఆధ్వర్యంలో కొత్త మంత్రివర్గం ఏర్పడినా.. ఈ జాతుల సమస్యకు మాత్రం ఇంకా పరిష్కారం లభించకపోగా, రాష్ట్రం (Manipur) రావణకాష్టంలా రగులుతూనే ఉంది.

Read Also: అమిత్ షా సిఫార్సు.. వద్దన్న రాహుల్ గాంధీ!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>