ఐదుగురితో అఫైర్స్, మరో యువతితో పెళ్లి.. ఇన్‌స్టా మోసగాడు అరెస్ట్

కలం, వెబ్ డెస్క్: ఇన్స్టాగ్రామ్ వేదికగా టీనేజర్స్, యువతులను టార్గెట్ చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్న మాయగాడు పవన్ అలియాస్ తరుణ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యువతులే లక్ష్యంగా ఫ్రెండ్ పేరుతో పరిచయం పెంచుకుంటాడు. తక్కువ సమయంలోనే వారిని నమ్మించివాడు. రిచ్ కిడ్ తరహాలో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవాడు. ఆరు నెలల వ్యవధిలోనే రెండు పోక్సో కేసులు నమోదయ్యాయి. ఐదుగురితో అఫైర్స్ నడుపుతూనే, మరో యువతితో ఏకంగా పెళ్లి కూడా చేసుకున్నట్లు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

గత మూడు నెలలుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న ఈ నిందితుడిని పట్టుకోవడానికి హైదరాబాద్ (Hyderabad), బంజారాహిల్స్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు ఒక బాధితురాలి స్నేహితురాలు ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ ఆధారంగా పవన్ ఆచూకీ కనిపెట్టారు. చాకచక్యంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా నిందితుడిపై కేవలం మోసాలు, అఫైర్లే కాకుండా పలు చోరీలు, స్నాచింగ్ కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. టీనేజ్ అమ్మాయిలు సోషల్ మీడియా పరిచయాల పట్ల అలర్ట్‌గా ఉండాలని పోలీసులు హెచ్చిరిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>