కలం, సినిమా : మెగాస్టార్ చిరంజీవి “మన శంకర్ వరప్రసాద్ గారు” సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అంచనాలకు మించి సక్సెస్ సాధించిన ఈ మూవీ 300 కోట్లు క్రాస్ చేసి 400 కోట్ల దిశగా దూసుకెళుతుంది. దీని తరువాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) బాబీ (Bobby) తో భారీ చిత్రం చేయనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలో ఈ క్రేజీ మూవీని సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ మూవీలో కృతి శెట్టి (Krithi Shetty) నటించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ సక్సెస్ జోష్ లో ఉన్న మెగాస్టార్ నెక్ట్స్ మూవీని వీలైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకురావాలి అనుకుంటున్నారు. చిరు, బాబీ కాంబోలో వాల్తేరు వీరయ్య సినిమా తెరకెక్కగా ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. దీనితో వీరిద్దరి కాంబోలో రానున్న మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఫిబ్రవరి నుంచి ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఇది తండ్రీకూతురు నేపధ్యంలో సాగే కథ అని తెలుస్తుంది. ఇందులో డాటర్ సెంటిమెంట్ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని టాక్ వినిపిస్తుంది.
ఉప్పెన తర్వాత కృతి శెట్టి (Krithi Shetty) తెలుగులో శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, ఆ అమ్మాయి గురించి నీకు చెప్పాలి వంటి తదితర చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆతర్వాత వారియర్, కస్టడీ, మాచర్ల నియోజకవర్గం.. ఇలా వరుసగా ప్లాపులు ఇవ్వడంతో కెరీర్ లో వెనుకబడింది. తమిళ్‌లో కార్తితో కలిసి నటించింది. బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంది. కానీ అక్కడ కృతి ఆఫర్‌ను కీర్తి సురేష్ దక్కించుకుంది. ఇలాంటి సమయంలో కృతి శెట్టి మెగాస్టార్ చిరంజీవికి డాటర్ గా నటించే ఛాన్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీతో కృతి మళ్లీ తెలుగులో బిజీ అవుతుందో లేదో చూడాలి.
Read Also: తెలంగాణ సాయుధ పోరాటగాథకు దృశ్యరూపం “గొల్ల రామవ్వ”
Follow Us On: Sharechat


