కలం, వెబ్ డెస్క్: ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో కేసీఆర్, హరీశ్ రావు (Harish Rao) సమావేశమయ్యారు. ఇటీవల హరీశ్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకున్నది. సిట్ విచారణ ఎలా సాగింది? విచారణ అధికారులు ఏయే ప్రశ్నలు అడిగారు? దానికి హరీశ్ రావు ఏం సమాధానం చెప్పారు? తదితర విషయాల మీద చర్చ జరిగినట్టు సమాచారం.
తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఈ ఇద్దరు నేతలు చర్చించినట్టు సమాచారం. జాగృతి అధ్యక్షురాలు కవిత నిత్యం బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. తాను కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితురాలినేనని ఆమె అంటున్నారు. హరీశ్ రావు, కేటీఆర్ మీద సంచలన ఆరోపణలు చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు ఆత్మరక్షణలో పడిపోతున్నారు. ఈ అంశంపై కూడా హరీశ్ రావు(Harish Rao), కేసీఆర్ చర్చించినట్టు సమాచారం. ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం జనంలోకి బలంగా వెళ్తే.. పార్టీకి ఎంతమేరకు డ్యామేజ్ ఉంటుంది? సిట్ విచారణను ఎలా ఎదుర్కోవాలి? దీంతోపాటు ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తగ్గించడం ఎలా? వంటి అంశాలపై ఇద్దరు నేతలు సుదీర్థంగా చర్చించినట్టు సమాచారం.
Read Also: బావబామ్మర్దుల్లో ఎవరి బలమెంత?
Follow Us On: Instagram


