కలం, మెదక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్(KCR)కు సిట్(SIT) నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం కేసీఆర్ నందినగర్ నివాసంలో సిట్ విచారణకు హాజరవ్వాల్సి ఉంది. సిట్ నోటీసులు నేపథ్యంలో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో కేసీఆర్ న్యాయ నిపుణులతో భేటీ అయ్యారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, ఇతర న్యాయవాదులు ఈ భేటీలో పాల్గొన్నారు. సిట్ నోటీసులు, విచారణపై న్యాయనిపుణులతో కేసీఆర్ చర్చిస్తున్నారు. రేపు హైదరాబాద్ నందినగర్ నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని సిట్ చెప్పిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్‌కు న్యాయ నిపుణులు ఏం చెప్తారు? కేసీఆర్ రేపు విచారణకు హాజరవుతారా లేదా అన్నది వేచి చూడాలి.


