కలం మెదక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసు, సిట్ నోటీసుల మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ హాట్ గా చర్చలు నడుస్తున్న వేళ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో పొలాలను మాజీ సీఎం కేసీఆర్(KCR) పరిశీలించారు. నిన్న విచారణకు రావాలని హైదరాబాద్ నందినగర్‌లో కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం, దానికి ప్రతిగా తను మున్సిపల్ ఎన్నికల పనుల్లో బిజీ ఉండటం వలన 30 తేదీన రాలేనని చెప్పి, వేరే తేదీని మీరే నిర్ణయించి చెప్పండని సిట్ కు కేసీఆర్ లేఖ రాశారు. మళ్ళీ సిట్ అధికారులు కేసీఆర్ కు ఎప్పుడూ నోటీసులు ఇస్తారు… ఎక్కడ ఇస్తారు అనే చర్చ నడుస్తున్న వేళ కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో పంటలను పరిశీలిస్తూ సమయం గడుపుతున్నాడు. ఫామ్ హౌస్ వద్ద ఉన్న మీడియా ప్రతినిధులకు అభివాదం చేసి కేసీఆర్ పంట పొలాలను వద్దకు వెళ్ళాడు. ఆయన తో పాటు మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుడా ఉన్నాడు.


