కలం, వరంగల్ బ్యూరో: తెలంగాణ ఉద్యమకారులు గాదె ఇన్నయ్య కుటుంబసభ్యులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) పరామర్శించారు. కొద్ది రోజుల క్రితం ఇన్నయ్య తల్లి థెరిసమ్మ కన్నుమూశారు. సోమవారం జనగామ జిల్లాలో జఫర్‌గఢ్‌కు వచ్చిన కవిత ఇన్నయ్య కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. అనంతరం ఇన్నయ్య (Gade Innayya) నిర్వహిస్తున్న ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ ఆశ్రయం పొందుతున్న వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇన్నయ్య వంటి ఉద్యమకారుడిని అరెస్టు చేయడం దుర్మార్గమని, ఇన్నయ్య కుటుంబానికి జాగృతి మద్దతుగా ఉంటుందని కవిత అన్నారు.


