నేడు సీబీఐ విచారణకు టీవీకే చీఫ్ విజయ్

క‌లం, వెబ్ డెస్క్‌: కరూర్ తొక్కిసలాట ఘటనపై నేడు టీవీకే అధినేత విజయ్ (TVK Chief Vijay) సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. ఇప్ప‌టికే విజ‌య్ రెండు సార్లు సీబీఐ విచార‌ణ‌కు హాజ‌రు కాగా ఈ నెల 10వ తేదీన సీబీఐ (CBI) విజయ్‌కి మ‌రోసారి నోటీసులు జారీ చేసింది. 2025 సెప్టెంబర్ 27న జరిగిన కరూర్‌లో విజ‌య్ నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ‌లో తొక్కిసలాట జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో 41 మంది చనిపోవడంతో సుప్రీం కోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు చేప‌ట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇప్పటికే జనవరిలో రెండు సార్లు సీబీఐ విజయ్‌ని విచారించింది. మ‌రోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కావాలనే రాజకీయంగా విజయ్‌ని రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నార‌ని టీవీకే పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>