కలం, వెబ్ డెస్క్: దేశంలో గ్యాస్ కష్టాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సామాన్య ప్రజలతో పాటు హోటళ్లు, హాస్టళ్లకు గ్యాస్ కొరత సెగ తాకింది. ఇప్పటికే గ్యాస్ లేదంటూ కొన్ని హోటళ్లు, హాస్టళ్లు మూతపడ్డాయి. ఇక మరికొన్ని రెస్టారెంట్లు, హోటళ్లు, హాస్టళ్ల ముందు కట్టెల పొయ్యిలు దర్శనమిస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ హీరో నాగశౌర్య (Naga Shaurya) తల్లి ఉషా మల్పూరి ఇదే బాటలో ముందుకెళ్తున్నారు. ఉషా మల్పూరి (Usha Mulpuri)కి ఓ రెస్టారెంట్ ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో కమర్షియల్ గ్యాస్ దొరికే ఛాన్స్ లేదు. దీంతో ఆమె రెస్టారెంట్‌లో కట్టెల పొయ్యిలు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. గ్యాస్ కష్టాలు తీవ్రంగా ఉన్నాయని, రెస్టారెంట్ మూసేయలేక ఇలా కట్టెల పొయ్యి పెట్టి వంట చేస్తున్నామని చెప్పారు. ఇక పొగ వల్ల నానా ఇబ్బందులు పడుతున్నామని, ఇంకా ఎన్ని రోజులు ఇలా కష్టపడాలో తెలియడం లేదని చెప్పారు. రెగ్యులర్ కస్టమర్లకు కొన్ని ఫుడ్ ఐటెమ్స్ అయితే అందిస్తున్నామని చెప్పారు.

