వాటర్ కమిషన్‌ను ఏర్పాటు చేసి ప్రతి గుంటకు నీళ్లు ఇస్తాం: కవిత

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రక్షణ సేన (TRS) అధికారంలోకి వచ్చాక కచ్చితంగా నీటి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెడుతామని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) స్పష్టం చేశారు. వాటర్ కమిషన్ (Telangana Water Commission)ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నీటి నిర్వహణ అంతా వాటర్ కమిషనే చూసుకుంటుందని.. సాగు యోగ్యమైన ప్రతి గుంటకు కూడా నీళ్లు ఇస్తామని వ్యాఖ్యానించారు. ప్రతి మూడు వేల ఎకరాలకు ఒక లష్కర్ ను నియమిస్తామన్నారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియాతో కవిత మీడియాతో మాట్లాడారు.

చెక్ డ్యామ్‌లు ఏర్పాటు చేస్తాం..

మన రాష్ట్రంలో ఉన్న అనేక చిన్న నదులపై ఎక్కడికక్కడ వందేళ్లు బలంగా ఉండే గేట్లతో కూడిన చెక్ డ్యామ్ లు ఏర్పాటు చేస్తామని కవిత స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినట్లు కొట్టుకుపోయే చెక్ డ్యామ్ లను కాకుండా పటిష్టమైన చెక్ డ్యామ్ లను నిర్మిస్తామన్నారు. కృష్ణా నదిలో 771 టీఎంసీలను ఆంధ్రావాళ్లు వాడుకున్నారని.. మనం వాటా మొత్తం వాడుకునేలా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరముందని చెప్పారు. తెలంగాణకు ప్రధాని మోదీ వస్తే బీఆర్ఎస్ కనీసం ఒక్క ప్రశ్న కూడా ఎందుకు అడగలేదు? అని ప్రశ్నించారు.దేశంలో 16 రాష్ట్రాల్లో జాతీయ హోదా ప్రాజెక్ట్‌లు ఇచ్చినట్లు తెలంగాణకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

50 శాతం రిజర్వేషన్లు సాధిస్తాం..

బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లులను కేంద్రం ఆమోదించేలా చర్యలు చేపట్టాలని కవిత అన్నారు. బీసీలకు రాజకీయాలు, విద్య, ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తిరిగి తమ వంతు ప్రయత్నం చేస్తామని చెప్పారు. పోలవరం, బనకచర్ల ప్రాజెక్ట్ లు మొదలుపెట్టినప్పుడు తాము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశామని.. ఆ లేఖనే రిట్ పిటిషన్ గా వేసి న్యాయపోరాటం కూడా చేస్తామని ప్రకటించారు. కేంద్ర ఇరిగేషన్ మంత్రి సీఆర్ పాటిల్ ను కలిసి తెలంగాణ ప్రాజెక్ట్ ల కోసం మాట్లాడుతామని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>