Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రేమపేరుతో మహిళా కానిస్టేబుల్‌ను మోసం చేసిన ఎస్ఐ.. చివరకు ఏమైందంటే!

కలం, వెబ్ డెస్క్: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళా కానిస్టేబుల్‌ను మోసం చేశాడు కొల్లూరు ఎస్ఐ (Kolluru SI) సురేశ్ కుమార్‌. ఈ ఘటనలో అతనిపై ఉన్నతాధికారులు వేటు వేశారు. 2018 బ్యాచ్‌కు చెందిన సురేశ్ కుమార్ కొల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ విధులు నిర్వహిస్తుండగా, కూకట్‌పల్లి స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అయితే కొంతకాలంగా పెళ్లి విషయంపై ఒత్తిడి తీసుకురాగా, సురేశ్ తప్పించుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలో ఇటీవల ఇద్దరి మధ్య గొడవ జరిగింది. పెళ్లి (Marriage) చేసుకోవడం కుదరదని సురేశ్ తేల్చి చెప్పాడు.

తనను ప్రేమ పేరుతో మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని గ్రహించిన బాధితురాలు, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సురేశ్ తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యాడు. బాధితురాలు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన ఉన్నతాధికారులు సురేశ్‌ను (Kolluru SI) సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

Read Also: అమెరికా పేరు మార్చాలంటున్న ఆర్జీవీ.. కొత్త పేరు సూచ‌న‌!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>