కల్వకుర్తి అభివృద్ధిపై ఫోకస్.. సీఎంకు ఎమ్మెల్యే కసిరెడ్డి కీలక ప్రతిపాదనలు

కలం, కల్వకుర్తి: కల్వకుర్తి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ని కల్వకుర్తి ఎమ్మెల్యే (Kalwakurthy MLA) కసిరెడ్డి నారాయణరెడ్డి (Kasireddy Narayan Reddy) కోరారు. బుధవారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలను సీఎంకు సమర్పించారు.

ఆమనగల్‌, కల్వకుర్తి మున్సిపాలిటీల్లో సీసీ రోడ్లు, యూజీడీ పనులకు మొత్తం రూ.80 కోట్లు మంజూరు చేయాలని కోరారు. ఆమనగల్‌కు రూ.30 కోట్లు, కల్వకుర్తికి రూ. 50 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, గ్రామపంచాయతీల్లో యూజీడీ వ్యవస్థ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేయాలని కోరారు. అలాగే పేదలు, లంబాడీ కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా అదనంగా 2,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

అర్హులైన నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే ప్రతిపాదనలపై సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అవసరమైన సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>