కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగులను గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం నిలువునా వంచించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మండిపడ్డారు. తెలంగాణ సాకారం కోసం సకల జనుల సమ్మెలో తమ ఉద్యోగాలను, కుటుంబాలను ఫణంగా పెట్టి రోడ్డు మీదకు వచ్చి కొట్లాడారని గుర్తు చేశారు. అప్పట్లో కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఉద్యోగుల కష్టాలను తీరుస్తామని చెప్పి, పదేళ్ల కాలంలో వారి కనీస అవసరమైన క్యాష్ లెస్ హెల్త్ కార్డ్ డిమాండ్‌ను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) పట్టించుకోలేదన్నారు. అడిగితే కాలయాపన చేయడం తప్ప, ఉద్యోగస్తుల సంక్షేమం గురించి ఆలోచించిన పాపాన పోలేదని దుయ్యబట్టారు.
కానీ, ఈరోజు ప్రజా ప్రభుత్వం మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఉద్యోగుల కోసం క్యాష్ లెస్ హెల్త్ కార్డ్ విధానాన్ని అమలు చేస్తూ బడ్జెట్‌లో నిధులు కేటాయించిందని భట్టి (Bhatti Vikramarka) వివరించారు. తమ ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం బడ్జెట్ ప్రవేశపెడుతుంటే.. అది చూసి ఓర్వలేక, చర్చకు నిలబడలేక బడ్జెట్ పత్రాలను చింపి సభ నుండి పారిపోవడం బిఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని విమర్శించారు. ఉద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల కనీస బాధ్యత లేని వీరికి.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పారు.
Read Also: టెంపుల్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్.. చితకబాదిన స్థానికులు!
Follow Us On: Instagram

