DC మూవీ క్రేజ్​.. భారీ ఆఫర్​ కొట్టేసిన వామిక గబ్బి

కలం, వెబ్ డెస్క్:  వామిక గబ్బి (Wamiqa Gabbi) 2026లో అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నారు. బాలీవుడ్‌లో విజయం సాధించిన ఈ నటి, తాజాగా విడుదలైన తమిళ చిత్రం ‘DC’ తో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రంలో ‘చంద్ర’ పాత్రలో ఆమె నటనకు చక్కటి ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తుండటంతో ఆమెకు మరో భారీ అవకాశం తలుపులు తట్టేలా చేసింది.

ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా పౌరాణిక చిత్రం ‘జై హనుమాన్’లో వానికా కీలక పాత్రకు ఎంపికైనట్లు సమాచారం. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో నటిస్తుండగా, వానికా పోషించనున్న పాత్రకు సంబంధించిన వివరాలను చిత్ర బృందం ఇంకా గోప్యంగా ఉంచింది.

తేజ సజ్జా ప్రధాన తారాగణంగా 2024లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘హను-మాన్’కి సీక్వెల్‌గా, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో రెండో సినిమాగా ‘జై హనుమాన్’ వస్తోంది. ఈ సీక్వెల్‌లో పలువురు కొత్త నటులు కనిపించనుండగా, వానికా గబ్బి ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. చంద్ర పాత్రలో ఆకట్టుకున్న వామిక టాలీవుడ్, బాలీవుడ్‌లో మరిన్ని ఆఫర్లు కొల్లగొట్టే అవకాశాలున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>