పోచారం బీఆర్ఎస్ ఎంట్రీపై మాజీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

కలం, నిజామాబాద్ బ్యూరో : బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని బీఆర్ఎస్‌లోకి రానివ్వం అని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ (Bajireddy Goverdhan) వ్యాఖ్యానించారు. అధికారం చెలాయించడం కోసం ప్రతీసారీ పోచారం పార్టీలు మారుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలన నచ్చి కాంగ్రెస్‌లోకి వెళ్లిన పోచారం.. చచ్చుకుంటూ అందులోనే ఉండాలని అన్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోచారంకు మూడుసార్లు టికెట్ ఇస్తే మూడు సార్లు బీఆర్ఎస్ నుంచి గెలిచారని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పోచారంకు మంత్రిగా, స్పీకర్‌గా అవకాశం కల్పించి కోట్లాది రూపాయల నిధులు ఇచ్చారని గుర్తు చేశారు. అలాంటి కేసీఆర్‌కు పోచారం మోసం చేశారని ధ్వజమెత్తారు.. పోచారం బీఆర్ఎస్‌లోకి రారని వచ్చినా తాము రానివ్వన్నారు. తనకున్న సిగ్నల్స్ ప్రకారం ఆయనను పార్టీలోకి తీసుకునే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>