Mobile Popup Ad
Mobile Popup Ad

అగ్నిగుండంలా క‌రీంన‌గ‌ర్.. అంతటా 46 డిగ్రీల పైనే!

కలం ,కరీంనగర్ బ్యూరో: భానుడి ఉగ్రరూపం రోజురోజుకు పెరుగుతుండటంతో ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లా అగ్ని గుండాన్ని తలపిస్తోంది. ఉష్ణోగ్ర‌త‌లు 46 డిగ్రీల సెల్సియస్ దాటడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఉమ్మ‌డి కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్టులో 46.4, పెద్దపల్లి జిల్లా ఓదెలలో 46.4, జగిత్యాల జిల్లా రాయికల్‌లో 46.3, రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్తన్‌పేట‌లో 46.1 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని మరో 19 ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైబడి పగటి ఉష్ణోగ్రతలు నమోదు కాగా కనిష్ఠ రాత్రి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలసెల్సియ‌స్‌కు చేరుకున్నాయి. 46 మండలాల్లో వడగాలులు నమోదయ్యాయి. మరికొన్ని రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉండనుంది.

Read Also: ఈవీల క్రేజ్.. ప్రభుత్వ ఆదాయానికి బ్రేక్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>