Mobile Popup Ad
Mobile Popup Ad

కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ అకౌంట్ బ్యాన్.. అంతలోనే..

కలం, వెబ్ డెస్క్: ఇటీవల సోషల్ మీడియాలో సంచలనంగా మారిన వ్యంగ్య డిజిటల్ వేదిక “కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) ఎక్స్‌ ఖాతాను భారత్‌లో బ్యాన్ చేశారు. ఖాతా బ్యాన్ చేసిన కొన్ని గంటల్లోనే కాక్రోచ్ ఈజ్ బ్యాక్ (Cockroach Is Back) పేరుతో కొత్త ఎక్స్ ఖాతా ప్రారంభించినట్టు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు.

ముందే ఊహించాను: అభిజీత్ దీప్కే

ఖాతా నిలిపివేతపై దీప్కే స్పందించారు. “నిన్ననే మా ఖాతాను హ్యాక్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఇటువంటిది ఏదో జరుగుతుందని ముందే ఊహించాను. కానీ ఇది ప్రభుత్వానికి సెల్ఫ్ గోల్ లాంటిది” అని ఆయన వ్యాఖ్యానించారు. తాము కొత్తగా ప్రారంభించిన కాక్రోచ్ ఈజ్ బ్యాక్ ఖాతా ద్వారా ముందుకు సాగుతామని, ఈ విషయంపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

గంటలోపే వేల సంఖ్యలో ఫాలోవర్లు

కొత్త హ్యాండిల్ ప్రారంభించిన ఒక గంటలోపే దానికి సుమారు 16,800 మంది ఫాలోవర్లు వచ్చినట్టు సంస్థ తెలిసింది. గతంలో సీజేపీ ఎక్స్ ఖాతాకు సుమారు 2.01 లక్షల ఫాలోవర్లు ఉన్నట్లు దీప్కే తెలిపారు. ఇదే సమయంలో సీజేపీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా మాత్రం యాక్టివ్‌గా కొనసాగుతూ సుమారు 14.3 మిలియన్ల ఫాలోవర్లతో ట్రెండ్ అవుతోంది.

ఈ డిజిటల్ వేదిక ఎలా పుట్టింది?

ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఓ కేసుకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. సమాజంలో ఉద్యోగాలు, అవకాశాలు లభించని కొంతమంది యువకులు వ్యవస్థలో “పారాసైట్స్, “కాక్రోచెస్ లాంటి పరిస్థితిలో ఉన్నారని.. మీడియా, సోషల్ మీడియా, ఆర్టీఐ కార్యకర్తలుగా మారి ప్రతి అంశాన్ని విమర్శిస్తూ వ్యవస్థపై దాడి చేస్తున్నారని వ్యాఖ్యానించినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.  ఈ కామెంట్ల అనంతరం కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. కాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ.. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని పేర్కొన్నారు. మే16న సీజేపీ అనే వ్యంగ్య డిజిటల్ ఉద్యమం ప్రారంభమై సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది.

మెటా ప్లాట్‌ఫారమ్‌ల్లో భారీ ఫాలోయింగ్

ఇన్‌స్టాగ్రామ్‌లో సీజేపీ ఖాతా 14 మిలియన్లకుపైగా ఫాలోవర్లను సంపాదించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. రోజురోజుకు ఫాలోవర్లు విపరీతంగా పెరుగుతున్నారు. ఈ అంశం కూడా విస్తృత చర్చకు దారితీసింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై కూడా హ్యాకింగ్ ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ అంశాన్ని కూడా వారు సంబంధిత సంస్థలకు తెలియజేశారని తెలిపారు.

ఇతర ‘కాక్రోచ్’ ఖాతాలు యాక్టివ్

ఎక్స్‌లో ఇంకా పలు ‘కాక్రోచ్’ పేరుతో ఖాతాలు యాక్టివ్‌గా కొనసాగుతున్నాయి. వాటిలో ‘The Cockroach Youth’, ‘Cockroach News’, ‘IAmCockroach’, ‘Cockroach Party of India’, ‘Cockroach Janata Party (Gen Z)’ వంటి పేజీలు ఉన్నాయి. మొదట వ్యంగ్య ఉద్యమంగా ప్రారంభమైన ఈ వేదిక ఇప్పుడు డిజిటల్ నిరసన రూపం తీసుకున్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మీమ్స్, యానిమేషన్లు, మ్యానిఫెస్టో తరహా కంటెంట్ ద్వారా ఇది యువతలో వేగంగా ప్రాచుర్యం పొందింది. పాలకుల పట్టించుకోకుండా వదిలేసిన ప్రజల కోసం ఈ వేదికను రూపొందించినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. వ్యంగ్య ప్రాజెక్ట్‌గా ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ చర్చలకు కేంద్రంగా మారింది. మరి ఈ డిజిటల్ ఉద్యమం టీ కప్పులో తుఫాన్ లాగా అయిపోతుందా? లేదంటే భారీ సంచలనాలు నమోదు చేస్తుందా? అన్నది వేచి చూడాలి.

Read Also: అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి?.. రంగంలోకి దిగిన రజనీకాంత్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>