నేడు, రేపు కడప జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన

కలం, వెబ్ డెస్క్ :  వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (YS Jagan)  నేటి నుంచి రెండు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు పులివెందుల చేరుకుంటారు. అనంతరం బాకరాపురం క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి స్వయంగా వినతి ప్రతాలను స్వీకరిస్తారు. రాత్రి పులివెందులలోని తన నివాసంలో బస చేస్తారు.

రెండో రోజు ఇడుపులపాయకు వైఎస్ జగన్

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేకరరెడ్డి జయంతిని పురస్కరించుకొని బుధవారం నాడు వైఎస్ జగన్ ఇడుపులపాయకు వెళ్లనున్నారు. ఈ మేరకు 8న ఉదయం 7.30 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి ఇడుపులపాయకు చేరుకుంటారు. అనంతరం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద జరిగే ప్రత్యేక సంస్మరణ ప్రార్థనల్లో పాల్గొంటారు. తన తండ్రి వైఎస్సార్‌కు జగన్ నివాళులర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి ప్రయాణమవుతారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>