వివాదాలకు కేరాఫ్ కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి

కలం, వెబ్ డెస్క్: ఆ మహిళా ఎమ్మెల్యే వివాదాలకు కేరాఫ్. ఆమె ఏదైనా సమావేశానికి వస్తుందంటే అంతా అలర్ట్ అయిపోతున్నారు. ఎవరితో గొడవ పెట్టుకుంటుందో.. ఏం వివాదం సృష్టిస్తుందో అన్న చర్చ సాగుతోంది. చిన్న చిన్న విషయాలకే అలగడం.. ప్రొటోకాల్ పాటించడం లేదంటూ సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోవడం ఆమెకు కామన్. ఆ ఎమ్మెల్యే మరెవరో కాదు కడప శాసనసభ్యురాలు రెడ్డప్పగారి మాధవి రెడ్డి. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా‌లో ఎమ్మెల్యేగా గెలవడంతో టీడీపీ శ్రేణులు మాధవి రెడ్డి (MLA Madhavi Reddy)ని నెత్తినపెట్టుకున్నారు. తొలుత దూకుడుగా వ్యవహరించిన  ఈ ఎమ్మెల్యేకు టీడీపీ శ్రేణుల నుంచి బాగానే మద్దతు దక్కేది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ఆమె ఘాటు విమర్శలు చేస్తుండటంతో ఆమెను తెలుగుదేశం అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే రాను రాను ఆమె వ్యవహారశైలి వింతగా మారిపోయింది. పార్టీ కోసమో, ప్రజల కోసం కాకుండా వ్యక్తిగత ఇగో కోసం ఆమె అధికారులతో గొడవలు పెట్టుకోవడం సొంతపార్టీ నేతలకే నచ్చడం లేదట. తనకు కుర్చీ వేయలేదని.. తన పేరు మైక్‌లో ఆలస్యంగా పిలిచారని.. అధికారుల మీద రుసరుసలాడుతుంటారు. ఈ దూకుడు స్వభావంతో ఆమె ప్రజల్లో, పార్టీ కార్యకర్తల్లో పలుచన అవుతున్నారు.

టిడ్కో ఇళ్ల పంపిణీలో లొల్లి

ఇటీవల టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి (MLA Madhavi Reddy) రెచ్చిపోయారు. అధికారుల మీద విరుచుకుపడ్డారు. అందుకు కారణం ఆమె పేరు కొంచెం ఆలస్యంగా చదవడమే. కడప జిల్లాలో టిడ్కో ఇళ్ల పంపిణీ సందర్భంగా అధికారులు తొలుత ఇన్‌చార్జి మంత్రి సవితను వేదిక మీదకు ఆహ్వానించారు. ఈ తర్వాత జాయింట్ కలెక్టర్‌ను వేదిక మీదకు పిలిచారు. దీంతో మాధవిరెడ్డికి కోపం కట్టలు తెంచుకున్నది. ప్రొటోకాల్ ప్రకారం మంత్రి తర్వాత తన పేరు పిలవాలన్నది మాధవిరెడ్డి వాదన. ఇది ప్రోటోకాల్ పాటించడం అనుకుంటున్నారా?’ అంటూ నిర్వాహకులను నిలదీశారు. అక్కడ అధికారులు సర్దిచెప్పినా ఆమె వినిపించుకోలేదు. అయితే ఎమ్మెల్యే తీరుపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. కేవలం పేరు తర్వాత పిలిచినంత మాత్రాన ఇంత రాద్ధాంతం చేయాలా? అన్న విమర్శలు వస్తున్నాయి.

పంద్రాగస్ట్ వేడుకలోనూ..

గతంలో పంద్రాగస్ట్ కార్యక్రమంలో వేదికపై తనకు సరైన ప్రోటోకాల్ ఇవ్వలేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేజ్‌పై మంత్రి పక్కన కుర్చీ వేయలేదని, తనను సమయానికి ఆహ్వానించలేదని అధికారులపై మండిపడ్డారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినప్పటికీ.. సుమారు అరగంటపాటు నిల్చొని ఉండాల్సి వచ్చిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరికి ఆగ్రహంతో సభ నుంచి వెనుదిరిగారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే తన తీరు మార్చుకోవాలని.. చీటికి మాటికి గొడవ పెట్టుకోవడం, ప్రొటోకాల్ పేరుతో రచ్చచేయడం తగ్గించుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read Also: సమ్మర్‌లో హెల్తీగా ఉండాలా.. ఈ 5 టిప్స్ మీకోసమే

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>