కలం, వరంగల్ బ్యూరో : ములుగు (Mulugu) జిల్లా పస్రా–తాడ్వాయి ప్రధాన రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాడ్వాయికి సమీపంలో కారు, లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది.
స్థానికుల సమాచారం ప్రకారం.. పస్రా వైపు నుంచి తాడ్వాయి వైపు వెళ్తున్న కారు ఎదురుగా వచ్చిన లారీని ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఢీకొన్న వేగానికి కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. కారులో ఉన్న ఇద్దరు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతులను వరంగల్ నగరంలోని కరీమాబాద్‌కు చెందినవారిగా గుర్తించారు.

