కలం, వెబ్ డెస్క్ : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. టీవీకే అధ్యక్షుడు విజయ్ (TVK Chief Vijay) ఇటీవల తన పార్టీ అభ్యర్ధుల జాబితాను ప్రకటించారు. ఆసక్తికరంగా విజయ్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. చెన్నై జిల్లాలోని పెరంబూర్, తిరుచ్చి జిల్లాలోని తిరుచ్చి ఈస్ట్ స్థానాల నుంచి విజయ్ పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తాను పోటీ చేస్తున్న పెరంబూర్ (Perambur) అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేస్తూ.. తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. అఫిడవిట్ ప్రకారం, విజయ్ వద్ద సుమారు రూ.405 కోట్ల విలువైన చరాస్తులు (Movable Assets) ఉన్నాయి. అలాగే ఆయనకు రూ.115 కోట్ల విలువైన స్థిరాస్తులు (Immovable Assets) కూడా ఉన్నట్లు వెల్లడైంది.
అలాగే విజయ్ (TVK Chief Vijay) భార్య సంగీత పేరుమీద కూడా భారీగా ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆమెకు ఇండియన్ బ్యాంకులో సుమారు రూ.25 కోట్లు, ఆక్సిస్ బ్యాంకులో రూ.40 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో రూ.20 కోట్లు డిపాజిట్లు ఉన్నట్లు వెల్లడైంది. ఇవేకాకుండా, ఆమె పేరుమీద 391 సావరిన్‌ల బంగారు ఆభరణాలు కూడా ఉన్నట్లు నామినేషన్ పత్రాల్లో నమోదు చేశారు. ఈ ఆస్తుల వివరాలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Read Also: సమ్మర్‌లో హెల్తీగా ఉండాలా.. ఈ 5 టిప్స్ మీకోసమే
Follow Us On : WhatsApp

