మహనీయుల త్యాగాలు స్మరించుకుందాం: గణేష్ బిగాల

కలం, నిజామాబాద్ బ్యూరో : 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల (Ganesh Bigala) నిజామాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మొదట ఎల్లమ్మగుట్టలోని BRS పార్టీ జిల్లా కార్యాలయంలో పాల్గొన్నారు. అనంతరం RR చౌరస్తా శివాజీ చౌక్‌లో సిర్ప రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

అలాగే జూబ్లీ హోటల్ చౌరస్తా, ఖిల్లా రోడ్‌లో BRS నాయకులు అబ్దుల్ మతీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆవిష్కరించారు. 58వ డివిజన్ అధ్యక్షులు సమీ ఆధ్వర్యంలో దారుగల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం 15వ డివిజన్ BRS నాయకులు ముస్తాక్ ఆధ్వర్యంలో నిజాం కాలనీ మెయిన్ రోడ్, అర్సపల్లిలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను కూడా మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, NUDA మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సత్య ప్రకాష్, సుజిత్ సింగ్, BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>