నేటి నుంచి అసెంబ్లీ సెషన్.. గవర్నర్ ప్రసంగంతో స్టార్ట్

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు (Telangana Budget Session) సోమవారం ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర మంత్రివర్గం రూపొందించిన షెడ్యూలు ప్రకారం మార్చి 30 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. మొత్తం 15 రోజుల షెడ్యూలులో మూడు పండగలు, రెండు ఆదివారాలకు సెలవులు పోగా పది రోజులు సమావేశాలు జరిగే అవకాశమున్నది. సమావేశాల షెడ్యూలు ఎలా ఉన్నా ద్రవ్య వినిమయ బిల్లుకు మాత్రం ఉభయ సభలు మార్చి 31 లోగా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేయనున్నారు. ఆ తర్వాత సమావేశాలు మరుసటి రోజుకు వాయిదా పడతాయి. సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశమై బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశమై ఖరారు చేస్తుంది. గవర్నర్ ప్రసంగం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం కూడా జరుగుతుంది.

గవర్నర్ శుక్లాకు ఫస్ట్ స్పీచ్ ఇదే :

రాష్ట్ర గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) ఈ నెల 11న బాధ్యతలు స్వీకరించారు. ఆరో రోజునే ఆయన ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తుండడం విశేషం. సభా సంప్రదాయాల ప్రకారం గత సమావేశాలు ప్రోరోగ్ కావడంతో బడ్జెట్ సమావేశాలు (Telangana Budget Session) గవర్నర్ ప్రసంగంతోనే మొదలుకావాల్సి ఉంటుంది. ఆ ప్రకారం గవర్నర్ శుక్లాకు ఉభయ సభలను ఉద్దేశించి చేసే తొలి ప్రసంగం ఇదే. ఆయన ప్రసంగంలో ఏయే అంశాలను ప్రస్తావిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, ప్రస్తుతం రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ అంశాలు, రానున్న రోజుల్లో ప్రభుత్వ ప్రాధాన్యతలు.. వీటితో ప్రత్యక్ష పరిచయం లేకుండానే ప్రసంగిస్తుండడం గమనార్హం. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగాన్ని గవర్నర్ చదవనున్నారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన ఐదు రోజుల్లోనే స్పీచ్ ఇవ్వడం ప్రత్యేకత.

అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్న విపక్షాలు :

రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి, కార్నర్ చేయడానికి, వైఫల్యాలను ఎత్తి చూపడానికి ఈ సమావేశాలను వేదికగా వాడుకోవాలని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (BRS) ప్రణాళిక సిద్ధం చేసుకున్నది. హైడ్రా కూల్చివేతలు, మూసీ పునరుజ్జీవం, గాంధీ సరోవర్ ప్రాజెక్టు, రైతు భరోసా, విద్యా కమిషన్ నివేదిక, హిల్ట్ పాలసీ, సంక్షేమ పథకాల అమలు, ఆర్థిక వ్యవస్థ నిర్వహణ, కృష్ణా-గోదావరి జలాల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం.. ఇలాంటి అనేక అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని బీఆర్ఎస్ భావించింది. దానికి అవసరమైన డాక్యుమెంట్లు, ప్రభుత్వ కరస్పాండెన్స్ తదితరాలను సిద్ధం చేసుకున్నది. మరోవైపు అసెంబ్లీ దృష్టిని ఆకర్షించేలా ఆందోళనలు చేయాలని ప్లాన్ చేసుకున్నది. విపక్షాల ఎత్తుల్ని చిత్తు చేసేలా కాంగ్రెస్ సభ్యులు సైతం కౌంటర్ వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నారు.

Read Also: అన్నదాతలకు గుడ్​ న్యూస్​.. ‘రైతు భరోసా‘ ముహూర్తం ఫిక్స్​

Follow Us On: Sharechat

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>