Mobile Popup Ad
Mobile Popup Ad

ఆరో రోజుకు చేరిన ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియా యుద్ధం ఆరో రోజుకు చేరుకుంది. ఇరాన్ మీద ఇజ్రాయెల్-అమెరికాలు (Iran-Israel War) భీకర దాడులు చేస్తున్నాయి. అనేక వ్యవస్థలను సర్వనాశనం చేస్తున్నాయి. అటు ఇరాన్ కూడా రెచ్చిపోతూనే ఉంది. చుట్టూ ఉన్న గల్ఫ్‌ దేశాలపై దాడులు కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్ పై దాడులను మరింత పెంచింది ఇరాన్. టెల్ అవీవ్ మీద బాలిస్టిక్ మిస్సైళ్లతో విరుచుకుపడింది. అలాగే బహ్రెయిన్ లో యూఎస్ నేవీ ఫ్లీట్ ను కూడా ధ్వంసం చేసింది. ఖతార్ లోని యూఎస్ ఎంబసీపై మరోసారి దాడి చేసి తీవ్ర నష్టం కలిగించింది.

అమెరికా భీకర దాడులు..

ఇరాన్ పై అమెరికా భీకరంగా దాడులు (Iran-Israel War) చేస్తూనే ఉంది. ఇరాన్ మీద ఇప్పటి వరకు 500లకు పైగా బాలిస్టిక్ మిస్సైళ్లు, 2వేలకు పైగా డ్రోన్లతో దాడి చేసినట్టు వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఇరాన్ మీద మరింత అడ్వాన్స్ డ్ వెపన్స్ తో దాడి చేస్తామని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. తమ వద్ద లెక్కలేనన్ని ఆయుధాలు ఉన్నాయని.. ప్రపంచానికి తెలియని చోట్ల విదేశాల్లోనూ ఆయుధ నిల్వలు ఉన్నట్టు అమెరికా ప్రకటించింది.

బలైపోతున్న సామాన్య జనాలు..

ఈ దేశాల వార్ తో సామాన్య జనాలు పిట్టళ్లా రాతిపోతున్నారు. ఇప్పటికే ఇరాన్ లో వెయ్యి మందికి పైగా మృతి చెందారు. అటు ఇజ్రాయెల్ లో ప్రజలు వణికిపోతున్నారు. ఇజ్రాయెల్ లోనూ వందల మంది మృతి చెందుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇరాన్ దాడులను గల్ఫ్‌ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అనవసరంగా తమను యుద్ధంలోకి లాగుతున్నారంటూ మండిపడుతున్నాయి. కానీ ఇరాన్ మాత్రం దాడులను అస్సలు తగ్గించట్లేదు.

Read Also: ట్రంప్‌ను చంపేందుకు ఇరాన్ మాస్ట‌ర్ ప్లాన్!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>