ట్రంప్‌ను చంపేందుకు ఇరాన్ మాస్ట‌ర్ ప్లాన్!

క‌లం, వెబ్ డెస్క్‌: ట్రంప్ హ‌త్య‌కు ఇరాన్ (Iran) సైన్యం వేసిన మాస్ట‌ర్ ప్లాన్ తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎన్నో రోజుల క్రితం ట్రంప్‌ను (Trump) మ‌ట్టుబెట్టేందుకు ఇరాన్ పాక్ గూఢ‌చారిని అమెరికాకు పంపించిన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అమెరికాలో ఉన్న పాక్ గూఢ‌చారి ఆసిఫ్ మ‌ర్చంట్‌ (Asif Merchant)ను విచారించ‌గా సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. 2024లో ట్రంప్ హ‌త్యా య‌త్నం కేసులో ఆసిఫ్ మ‌ర్చంట్ అరెస్ట్ అయ్యాడు. ఈ సంద‌ర్భంగా ఎఫ్‌బీఐ అత‌డిని విచారించింది. ఈ విచార‌ణ‌లో ఆసిఫ్ కీల‌క విష‌యాలు వెల్ల‌డించాడు.

ఇరాన్ ఇంటెలిజెన్స్‌కు (Iran Intelligence) చెందిన ఓ వ్య‌క్తి త‌న‌ను సంప్ర‌దించి రంగంలోకి దించిన‌ట్లు ఎఫ్‌బీఐకి తెలిపాడు. ట్రంప్‌, బైడెన్‌, నిక్కీ హేళీని చంపేందుకు ప్లాన్ వేసిన‌ట్లు వివ‌రించాడు. ఇందు కోసం ముంద‌స్తుగా కొంద‌రికి రూ.4.6 ల‌క్ష‌లు ఇచ్చిన‌ట్లు అంగీక‌రించాడు. దీంతో ఆసిఫ్ మ‌ర్చంట్ నేప‌థ్యంపై అధికారులు ఆరా తీశారు. ఆసిఫ్ మ‌ర్చంట్ కుటుంబం ఇరాన్‌లోనే ఉన్న‌ట్లు గుర్తించారు. మ‌రోవైపు ఆసిఫ్ లాయ‌ర్లు ఆయ‌న ఇరాన్‌లో చేసిన ప‌ర్య‌ట‌న‌లు మత‌ప‌ర‌మైన‌విగా పేర్కొన్నా రు.

Read Also: బీహార్ సీఎం నితీశ్ కుమార్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

Follow Us On: Youtube

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>