కరీంనగర్‌ జిల్లాలో ​గంజాయి ముఠా అరెస్ట్

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో గంజాయి విక్రయిస్తూ, సేవిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం చాకచక్యంగా పట్టుకున్నారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి వావిలాలపల్లి ప్రాంతంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ నేతృత్వంలోని బృందం దాడులు నిర్వహించింది. ప్రధాన నిందితుడు బెజ్జంకి లోకేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 22 గంజాయి ప్యాకెట్లు, నాలుగు గంజాయి చాక్లెట్లు, బైక్, ​6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. లోకేష్‌తో పాటు ఒకే గదిలో ఉంటున్న మరో ముగ్గురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. తాము కూడా గంజాయి తాగుతున్నట్లు సదరు యువకులు పోలీసుల విచారణలో అంగీకరించారు. అనంతరం వీరిని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>