మహేశ్ కోసం ఆ ముగ్గురు? రాజమౌళి తర్వాత ఎవరో!

కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఆయనకు తెలుగులోనే కాదు.. పాన్ ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ఉంది. దర్శక ధీరుడు రాజమౌళి ‘వారణాసి’ మూవీతో క్రేజ్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు తదుపరి చిత్రానికి సంబంధించి టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మొన్నటివరకు ఒక్కరే పేరే వినిపించింది. ఆ తర్వాత ఇద్దరు అనుకుంటే.. ఇప్పుడు ఏకంగా ముగ్గురు క్రేజీ దర్శకుల పేర్లు మహేశ్ చుట్టూ గట్టిగా వినిపిస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం మహేష్ బాబు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళితో కలిసి ప్రతిష్టాత్మకమైన అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు మహేశ్ ఫ్రీ అవ్వరని అందరికీ తెలిసినప్పటికీ.. ఆయన లైనప్ గురించి చర్చలు మాత్రం ఇండస్ట్రీలో జోరుగా సాగుతున్నాయి. పెద్ది ఫేం బుచ్చిబాబు, సందీప్ రెడ్డి వంగా, అనిల్ రావిపూడి మహేశ్‌తో (Mahesh Babu) సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జక్కన్నతో తన సినిమాను త్వరగా ముగించి, మరో సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు మహేశ్. ముగ్గురిలో ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు అనేది వేచి చూడాల్సిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>