epaper
Thursday, March 5, 2026
epaper

హిస్సార్ ఎక్స్‌ప్రెస్‌కు త‌ప్పిన పెను ప్ర‌మాదం

క‌లం, వెబ్ డెస్క్‌: క‌రీంన‌గ‌ర్ జిల్లాలో హిస్సార్ ఎక్స్‌ప్రెస్ (Hisar Express) రైలుకు పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఇంజిన్ వీల్ విరిగి పోవ‌డంతో రైలు నిలిచిపోయింది. దీంతో ప్ర‌యాణికులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. జమ్మికుంట మండలంలోని మడిపల్లి శివారులో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇంజిన్ వీల్ విరిగి రైలు ఆగిపోవ‌డంతో ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి రెండు గంటల నుంచి రైలు అక్క‌డే ఆగిపోయింది. ఉప్పల్ రైల్వేస్టేషన్ సమీపంలోని మడిపల్లి గేట్ వద్ద సుమారు నాలుగు గంటల పాటు నిలిచిపోయింది. మర్మమతులు చేపట్టిన అనంతరం వేరే ఇంజిన్‌తో ఉప్పల్ రైల్వే స్టేషన్‌కు తరలించారు.

Read Also: బీహార్ సీఎం నితీశ్ కుమార్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!