Mobile Popup Ad
Mobile Popup Ad

ఇన్‌స్టాగ్రామ్ ఫేక్ ప్రొఫైల్‌తో ప్రేమ వల.. యువతుల నుంచి లక్షలు కాజేసిన యువకుడు

కలం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లాలో ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వేదికగా జరిగిన ఒక భారీ మోసం (Scam) జరిగింది. ఐపీఎస్ ఆఫీసర్, ఎంబీబీఎస్ స్టూడెంట్ అని నమ్మిస్తూ టేక్మాల్ గ్రామానికి చెందిన ఇద్దరు యువతులను ఒక కేటుగాడు నిలువునా ముంచాడు. సోషల్ మీడియా పరిచయాలను నమ్మి మోసపోవద్దని ఎంత చెబుతున్నా.. కొందరు అమాయకులు బలైపోతూనే ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ప్రొఫైళ్లతో, తప్పుడు పేర్లతో ఇద్దరు యువతులను ప్రేమ పేరుతో నమ్మించి లక్షలాది రూపాయలు కాజేసిన ఒక కేటుగాడి ఉదంతం మెదక్ జిల్లా టేక్మాల్‌లో వెలుగుచూసింది.

​టేక్మాల్ గ్రామానికి చెందిన దుర్గేష్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరును రిత్విక్ రెడ్డిగా మార్చుకుని అదే గ్రామానికి చెందిన ఓ యువతికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఆమె దాన్ని యాక్సెప్ట్ చేయడంతో పరిచయం పెంచుకున్నాడు. తాను ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో ఐపీఎస్ ట్రైనింగ్‌లో ఉన్నానని నమ్మబలికాడు. నిరంతరం చాటింగ్ చేస్తూ, ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ తర్వాత తన ఖర్చుల నిమిత్తం డబ్బులు కావాలంటూ సదరు యువతి నుండి విడతల వారీగా రూ. 5 లక్షల నగదుతో పాటు తులం బంగారు కమ్మలను కాజేశాడు.

​​మొదటి యువతిని మోసం చేస్తున్న సమయంలోనే, అదే గ్రామానికి చెందిన మరో 17 ఏళ్ల మైనర్ బాలికపై దుర్గేష్ కన్ను పడింది. ఈసారి ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరును సాత్విక్ రెడ్డిగా మార్చుకుని ఆమెకు రిక్వెస్ట్ పంపాడు. బాలిక దాన్ని యాక్సెప్ట్ చేయగా.. తాను ఎంబీబీఎస్ (MBBS) చదువుతున్నానని నమ్మించాడు. కాలేజీ ఫీజులు, ఇతర ఖర్చులంటూ ఆ బాలికను కూడా నమ్మించి ఏకంగా రూ. 7 లక్షల రూపాయలను గుంజాడు.

పోలీసులను ఆశ్రయించిన బాధితులు

​ఇద్దరి దగ్గర నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన తర్వాత దుర్గేష్ తన మొబైల్ ఫోన్‌ను స్విచ్చాఫ్ చేసుకుని పరారయ్యాడు. మోసపోయామని గ్రహించిన ఇద్దరు బాధితులు విడివిడిగా టేక్మాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>