కలం, వెబ్‌డెస్క్: విమాన ప్రయాణికులకు అలర్ట్. ఫిబ్రవరి 11వరకు సెంట్రల్ ఏషియాలోని వివిధ నగరాలకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు మంగళవారం ఇండిగో (IndiGo) ప్రకటించింది. ఇరాన్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా దాడి ప్రయత్నాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆల్మాటీ (కజకిస్థాన్), బాకు (అజర్ బైజాన్), తాష్కెంట్(ఉజ్బెకిస్థాన్), బిసిలి (జార్జియా) నగరాలకు ఇండిగో ఫ్లైట్స్ రాకపోకలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
ఈ మేరకు ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే అత్యున్నత ప్రాధాన్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండిగో స్పష్టం చేసింది. ‘ప్రయాణికులు, సిబ్బంది భద్రతే మా మొదటి ప్రాధాన్యం. ఇరాన్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, కొన్ని విమానాల షెడ్యూల్‌లో మార్పులు చేశాం. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తాం. ఏవైనా మార్పులు ఉంటే తెలియజేస్తాం’ అని ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది.
ఇప్పటికే ఈ సిటీలకు రాకపోకలు సాగించేందుకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాలు ఎంచుకోవచ్చు. లేదా పూర్తిస్థాయి రీఫండ్‌ను ఇండిగో వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు. కాగా, గత ఆదివారం కూడా జనవరి 25కు షెడ్యూల్ అయిన ఢిల్లీ–బిసిలీ, ముంబై–ఆల్మాటీ విమాన సర్వీసులను ఇండిగో (IndiGo) రద్దు చేసిన విషయం తెలిసిందే.
Read Also: యాసిడ్ దాడి నిందితుల ఆస్తుల జప్తు… బాధితులకు పరిహారం: సుప్రీంకోర్టు
Follow Us On: Instagram


