ఉగాదికి “ఉస్తాద్ భగత్ సింగ్” తో అన్నీ శుభాలే : చిరంజీవి

కలం, సినిమా : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), కల్ట్ డైరెక్టర్ హరీశ్ శంకర్(Harish Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ” ఉస్తాద్ భగత్ సింగ్ “(Ustaad Bhagat Singh). ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఉగాది సందర్భంగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ సమీపించడంతో మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు.

రీసెంట్‌గా ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. పవన్ కల్యాణ్ పవర్ఫుల్ డైలాగ్స్ అదిరిపోయాయి. ఇదిలా ఉంటే ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ అదిరింది అంటూ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ట్వీట్ చేశారు. మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది.. ట్రైలర్ అదిరింది.. ఉగాదికి “ఉస్తాద్ భగత్ సింగ్” తో అన్నీ శుభాలే అంటూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కి, ఉస్తాద్ భగత్ సింగ్ టీంకి బెస్ట్ విషెస్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>