Mobile Popup Ad
Mobile Popup Ad

గాంధీ‌భవన్ ఎదుట కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డ్రగ్స్ టెస్టుకు సిద్ధం కావాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో పట్టుబడటంతో కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ డ్రగ్స్ వాడకాన్ని ప్రోత్సహించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆదివారం గాంధీ‌భవన్ ఎదుట కేటీఆర్ దిష్టి బొమ్మ కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. కేటీఆర్‌తోనే తెలంగాణలో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయిందని పేర్కొన్నారు. పైలట్ రోహిత్ రెడ్డి ఘటనతో మరోసారి ఇది రుజువైందని మండిపడ్డారు.

తమ పార్టీకి చెందిన నేత డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారని .. దీనిపై కేటీఆర్ ఏం చెప్తారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. ఇకనైనా కేటీఆర్ డ్రగ్స్ విషయంలో తప్పును ఒప్పుకోవాలని సూచించారు. ప్రజాప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతోందని చెప్పారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని, బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారన్నారు. ఈగల్ టీమ్ ఎవర్నీ వదిలిపెట్టదని డ్రగ్స్ వాడుతున్న వారిని వెంటాడి పట్టుకుంటుందని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>