కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. అప్పుల భారం తట్టుకోలేక పుట్టుకతో అంగవైకల్యంతో ఉన్న కూతరును చంపి (Parents Kill Daughter) ఆపై కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అల్విన్ కాలనీ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయనగర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. సతీష్ కుమార్ అనే వ్యక్తి ఆయన భార్య, కుమారుడు నితిన్ కుమార్, కుమార్తె శ్రీ జావలి కుటుంబ సభ్యలు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో మానసిక వేదనకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే పుట్టుకతో వికలాంగురాలైన కుమార్తె శ్రీ జావలిని చంపి.. ఆ తర్వాత భర్త, భార్య, కుమారుడు చేతులు కోసుకుని ఆత్మహత్యకు యత్నించారు.
Parents Kill Daughter | అయితే ఈ ఘటన జరిగి 48 గంటలు దాటినా వారు మరణించకపోవడంతో.. కుమారుడు నితిన్ తన స్నేహితుడు భాస్కర్‌కు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో భాస్కర్ ఘటనాస్థలికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తక్షణమే స్పందించి కుటుంబ సభ్యులను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరణించిన శ్రీ జావలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


