Mobile Popup Ad
Mobile Popup Ad

బీహార్ సీఎం నితీశ్ కుమార్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

క‌లం, వెబ్ డెస్క్‌: బీహార్ (Bihar) రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) తాను యాక్టివ్ పాలిటిక్స్ తప్పుకోబోతున్నట్లు హింట్ ఇస్తూ ఎక్స్‌ వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. తన రాజకీయ భవిష్యత్తుపై నితీశ్ చేసిన పోస్టులో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గడిచిన రెండు దశాబ్దాలకు పైగా బీహార్ ప్ర‌జ‌లు త‌న‌పై నమ్మకాన్ని చూపిస్తూ మ‌ద్ద‌తు ఇచ్చార‌ని పేర్కొన్నారు. ప్ర‌జా బలంతోనే తాను బీహార్‌కు నిబ‌ద్ధ‌త‌తో సేవ చేసిన‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌జ‌ల నమ్మకం, మద్దతు వల్లనే ఈరోజు బీహార్ అభివృద్ధిలో, గౌరవంలో కొత్త శిఖరాలను తాకుతోంద‌ని పేర్కొన్నారు.

ఇక త‌న రాజ‌కీయ‌ జీవితం ప్రారంభమైనప్పటి నుండి త‌న‌ మనసులో ఓ కోరిక ఉండేద‌ని నితీశ్ వెల్ల‌డించారు. బీహార్ శాసనసభలోని రెండు సభలతో (అసెంబ్లీ, కౌన్సిల్) పాటు పార్లమెంటులోని రెండు సభల్లోనూ (లోక్‌సభ, రాజ్యసభ) సభ్యుడిగా ఉండాలని అనుకున్న‌ట్లు తెలిపారు. ఆ క్రమంలోనే ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా వెళ్లాలని కోరుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌ల‌తో త‌న‌కు ఉన్న ఈ బంధం భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతుందని, రాష్ట్ర నాయ‌కుల‌తో కలిసి బీహార్‌ను అభివృద్ధి చేయాల‌నే త‌న‌ సంకల్పం అలాగే ఉంటుందని హామీ ఇచ్చారు. రాబోయే కొత్త ప్రభుత్వానికి త‌న‌ పూర్తి సహకారం, మార్గదర్శకత్వం ఉంటాయ‌ని వెల్ల‌డించారు. దీంతో నితీశ్ కుమార్‌ సీఎం పదవికి గుడ్ బై చెప్పిన‌ట్లేన‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. మ‌రోవైపు పార్టీ నేత‌లు నితీశ్ (Nitish Kumar) నిర్ణ‌యంపై తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Read Also: ట్రంప్‌ను చంపేందుకు ఇరాన్ మాస్ట‌ర్ ప్లాన్!

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>