లగ్జరీ కారు కొన్న రణ్‌‌వీర్ సింగ్.. ఎన్ని కోట్లంటే..?

కలం, వెబ్ డెస్క్ : ధురంధర్ (Dhurandhar) సిరీస్ తో నేషనల్ టాప్ హీరోల లిస్టులో చేరిపోయాడు రణ్‌ వీర్ సింగ్ (Ranveer Singh). ధురంధర్-1 దుమ్ము లేపింది. ఏకంగా వెయ్యి కోట్ల వసూళ్లు క్రాస్ చేసింది. ఇక రెండో పార్టు కూడా టాప్ రేంజ్ లో దూసుకుపోతోంది. ఇప్పటికే రూ.1500 కోట్ల వసూళ్లు దాటేసింది ఈ మూవీ. ఈ క్రమంలోనే రణ్ వీర్ సింగ్ కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.

తాజాగా అమెరికాకు చెందిన లగ్జరీ బ్రాండ్ హమ్మర్ కారును రణ్ వీర్ సింగ్ (Ranveer Singh) కొన్నాడు. దీని ఖరీదు రూ.5 కోట్లు. ఈ కారును ఇండియాలోకి దిగుమతి చేసుకున్నాడు రణ్ వీర్ సింగ్. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రణ్ వీర్ సింగ్ కు లగ్జరీ కార్లు అంటే చాలా ఇష్టం. అందుకే తన కారు గ్యారేజీలో లగ్జరీ కార్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. గత రెండు నెలల క్రితమే ఓ లగ్జరీ కారును కొన్నాడు ఈ టాప్ హీరో.

Read Also: దంతాలు దృఢంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>