మైనింగ్‌‌పై విచారణకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని మైనింగ్‌, ఇసుక తవ్వకాలపై విచారణకు ఆదేశించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) స్పష్టం చేశారు. అసెంబ్లీలో శనివారం ప్రతిపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ సభ్యులు మాటల తూటాలతో విరుచుకు పడ్డారు. ఈ మేరకు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ ఘాటుగా స్పందించారు. సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్ల ఇసుక మాఫియా ఘటనపై విచారణ చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సంతోశ్ రావు, ఆయన తండ్రి రవీందర్ రావుపై విచారణకు ఆదేశిస్తామని వ్యాఖ్యానించారు.

2014 జూన్‌ 2 నుంచి జరిగిన ఇసుక, మైనింగ్‌ తవ్వకాలపై విచారణకు ఆదేశిస్తున్నట్లు సభలో ప్రకటించారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ (Raghava Constructions) తో పాటు బీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్, వద్దిరాజు మైనింగ్‌ పై కూడా విచారణ చేయిస్తామన్నారు. అక్రమ మైనింగ్‌కు హరీశ్ రావు, కేటీఆర్ నాయకత్వం వహించారని ముఖ్యమంత్రి (CM Revanth Reddy) ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల బ్లాక్‌ మెయిల్స్‌కు భయపడేది లేదని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నివేదిక ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.

Read Also: BRS బడా నేతలకు బిగ్ షాకిచ్చిన CM రేవంత్ రెడ్డి

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>