కలం, వెబ్ డెస్క్ : బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని చెప్పకుండా మసిపూసి మారేడు కాయ చేశారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై మండిపడ్డారు. సింగరేణికి సంబంధించిన టెండర్లపై బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న ఆరోపణలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భట్టి (Bhatti Vikramarka) చేసిన వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. స్కామ్ జరగకపోతే టెండర్లు ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. నిష్పక్షపాతంగా విచారణ చేస్తామంటే తప్పకుండా భట్టి విక్రమార్క కే లేఖ రాస్తానని ఆయన స్పష్టం చేశారు.
సైట్ విజిట్ చేయడం.. నైని కోల్ బ్లాక్ (Naini Coal Block) టెండర్లు రద్దు చేయడం అంటే అవినీతి జరిగినట్లే కదా అని హరీశ్ రావు నిలదీశారు. భట్టి ఎన్ని సాకులు చెప్పినా బొగ్గు కుంభకోణం జరిగింది వాస్తవమేనని.. అందులో సీఎం రేవంత్ రెడ్డి బావమరిది రింగ్ మెన్ పాత్ర పోషించడం నిజమని ఆయన ఆరోపించారరు. భట్టి విక్రమార్క అంటే తనకు చాలా గౌరవం ఉందని.. బొగ్గు కుంభకోణంపై సిట్టింగ్ జడ్జీ, సీబీఐ విచారణకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశాన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, అతని బావమరిదిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని హామీ ఇస్తే లేఖ రాస్తా అని హరీశ్ రావు (Harish Rao) వెల్లడించారు.
Read Also: మున్సిపల్ ఎన్నికల్లో పోటీపై కవిత సంచలన నిర్ణయం ?
Follow Us On : WhatsApp


