epaper
Thursday, January 29, 2026
spot_img
epaper

సిట్ నోటీసుల వేళ.. రేవంత్‌కు హరీశ్ రావు వార్నింగ్

కలం, వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు రియాక్ట్ అవుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం అంటే సూర్యుడిపై ఉమ్మేసినట్టేనని, రేవంత్ రెడ్డికి పరిపాలించడం చేతకాక, ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలకు నోటీసులంటూ ప్రేమలేఖలు పంపిస్తున్నాడని సెటైర్లు వేశారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా ఇంకా గట్టిగా పోరాడతామని హరీశ్ రావు హెచ్చరించారు.

కేసీఆర్‌ (KCR)ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమేనని అన్నారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన నేతపై బురద చల్లాలని ప్రయత్నించడం.. సూర్యునిపై ఉమ్మి వేయడమే మండిపడ్డారు. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, సింగరేణి బొగ్గు కుంభకోణం మరకల నుంచి దృష్టి మళ్లించేందుకు రేవంత్ రెడ్డి చిల్లర రాజీకాయలు చేస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు.

రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. చరిత్రను సృష్టించినవాడు కేసీఆర్ అయితే, ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న చరిత్రహీనుడు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ సమాజమంతా కేసీఆర్ వెంటే ఉందని, రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదని హరీశ్ రావు తేల్చి చెప్పారు.

Read Also: మేడిగడ్డ బ్యారేజ్ డేంజరస్.. సీరియస్ కేటగిరీలో చేర్చిన కేంద్రం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>