కలం, వెబ్ డెస్క్: మహారాష్ట్రలోని బారామతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. (Devendra Fadnavis) కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుకు లేఖ రాశారు. ఈ లేఖపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ప్రమాదంపై ఇప్పటికే అధికారిక దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రామ్మోహన్ నాయుడు ప్రగాఢ సంతాపం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేశారు. నిర్దేశిత నిబంధనల ప్రకారం ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారికంగా దర్యాప్తు ప్రారంభించిందని మంత్రి తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఏఏఐబీతో పాటు డీజీసీఏ (డీజీసీఏ) బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని, విమానంలోని బ్లాక్‌బాక్స్‌ను స్వాధీనం చేసుకుని భద్రపరిచినట్లు వెల్లడించారు. దానిని సవివర సాంకేతిక విశ్లేషణకు పంపినట్లు తెలిపారు. ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదాలు, సంఘటనల దర్యాప్తుకు సంబంధించిన 2025 నిబంధనలు, నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా దర్యాప్తు పూర్తిస్థాయిలో, పారదర్శకంగా, కాలపరిమితిలో జరుగుతోందని మంత్రి వివరించారు.
సాంకేతిక రికార్డులు, ఆపరేషన్ వివరాలు, సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలను సమగ్రంగా పరిశీలించి ప్రమాదానికి దారి తీసిన కారణాలను గుర్తిస్తామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి రామ్మోహన్ నాయుడు .. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు (Devendra Fadnavis) వివరించారు.
దర్యాప్తు ప్రాథమిక నివేదిక, తుది నివేదికల ఆధారంగా అవసరమైన భద్రతా సూచనలు, నియంత్రణ, ఆపరేషన్ చర్యలను ఏఏఐబీ, డీజీసీఏ తదితర సంస్థలతో సమన్వయం చేసుకుని అమలు చేస్తామని స్పష్టం చేశారు. దర్యాప్తు వేగంగా పూర్తయ్యేందుకు మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం కీలకమని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సంఘటనా స్థలానికి సంబంధించిన అనుమతులు, స్థానిక పరిపాలన సహాయం, ఇతర శాఖలతో సమన్వయం అవసరమని తెలిపారు. దర్యాప్తులో లభించే ముఖ్యమైన అంశాలను రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకుంటామని భరోసా ఇచ్చారు.
Read Also: కర్ణాటక పోలీసులకు గుడ్‌న్యూస్
Follow Us On : WhatsApp


