నిజామాబాద్ లో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర..

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) నగరం జై హనుమాన్.. జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగింది. హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో భజరంగ్ దళ్, హిందూ వాహినీల ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. నగరంలోని నీల కంటేశ్వర ఆలయం వద్ద ఊరేగింపును నిజామాబాద్ బీజేపీ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా జెండా ఊపి ప్రారంభించారు. భారీ హనుమంతుని విగ్రహంతో పాటు శివుడు, రాముడు, భరత మాత, ఛత్రపతి శివాజీ లాంటి ప్రతిమలు ఊరేగించారు. నగరంలోని ప్రధాన వీధులు, మార్గాల మీదుగా శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. హనుమాన్ మాల దారులు యువకులు బీజేపీ తో పాటు అనుబంధ విభాగాల సభ్యులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. నిర్వహకులు జనాల కోసం అడుగడుగునా మంచినీటి సౌకర్యం మజ్జిగ పండ్లు పండ్ల రసాలు లాంటి వసతులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు  పోలీసు శాఖ 1300 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.

Read Also: ‘రామాయణ’ టీజర్‌ రిలీజ్‌.. శ్రీరాముడి అవతార్‌లో రణబీర్‌

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>