కలం, వరంగల్ బ్యూరో : నల్లబెల్లిలోని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగృహం వద్ద విషాద వాతావరణం నెలకొంది. అక్కడ ఏర్పాటు చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడంతో ఆయన సతీమణి పెద్ది స్వప్న (Peddi Swapna) భావోద్వేగానికి గురయ్యారు. విగ్రహం వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. భర్తను తలచుకొని రోదిస్తూ “నువ్వు లేని రోజు చూడు.. ఎంత అరాచకమో” అంటూ విలపించిన తీరు స్థానికులను, అభిమానులను తీవ్రంగా కలచివేసింది.

