‘రామాయణ’ టీజర్‌ రిలీజ్‌.. శ్రీరాముడి అవతార్‌లో రణబీర్‌

కలం, వెబ్ డెస్క్ : భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’ (Ramayana).‘దంగల్’ ఫేమ్ నితేష్ తివారీ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రం సుమారు రూ.4000 కోట్ల భారీ బడ్జెట్ తో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. గురువారం (2026 ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 2న) హనుమాన్‌‌‌‌‌‌‌‌ జయంతి సందర్భంగా ‘రామ’ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. 2 నిమిషాల 38 సెకన్ల నిడివి గల ఈ టీజర్ (Ramayana Teaser) మహాద్భుతంగా ఉంది.

పట్టాభిషేకం, అరణ్యవాసం వంటి ఘట్టాలతో ఈ టీజర్ ను రూపొందించారు. ఈ టీజర్‌లో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా కనిపించిన తీరు అద్భుతంగా ఉంది. ఆయన కళ్లలో కనిపించే ప్రశాంతత, రాజసం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది.హాలీవుడ్ రేంజ్ విజువల్స్, వీఎఫ్ఎక్స్‌ ఈ టీజర్‌కు హైలైట్‌ గా నిలిచాయి. ఇక ఈ చిత్రంలో అత్యంత శక్తివంతమైన రావణుడి పాత్రలో రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్నారు. యష్ లుక్ రివీల్ చేయకండా బ్యాక్ షాట్స్ మాత్రమే చూపించారు. అలాగే సీతగా సాయి పల్లవి నటించగా.. ఆమె లుక్ ను కూడా రివీల్ చేయలేదు. ఇందులో హనుమంతుని పాత్రలో సన్నీ డియోల్, లక్షణుడుగా రవి దూబే నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్ మరియు హాలీవుడ్ దిగ్గజం హన్స్ జిమ్మెర్ కలిసి సంగీతాన్ని అందిస్తున్నారు.

ప్రస్తుతం రిలీజ్ చేసిన ఈ ‘రామ’ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కేవలం టీజర్‌తోనే ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, రామాయణ పార్ట్-1 మూవీని 2026 దీపావళికి విడుదల చేయనున్నారు, 2027 దీపావళికి పార్ట్-2 ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>