హైదరాబాద్ మెట్రో ఆన్‌లైన్ సేవల్లో అంతరాయం

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) ఆన్‌లైన్ సేవల్లో అంతరాయం కలుగుతోంది. డిజిటల్ పేమెంట్స్ సిస్టం పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గూగుల్ పే, ఫోన్ పే, వాట్సాప్ వంటి ఆన్ లైన్ సేవలు పనిచేయకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. అన్ని మెట్రో స్టేషన్లలో ఇదే తరహా సమస్య రావడంతో ప్రయాణికులు ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద బారులు తీరారు. మియాపూర్ స్టేషన్‌లో అధికారులపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్య తలెత్తడంతో పేమెంట్స్ నిలిచిపోయాయమని, పునరుద్ధరించడానికి టెక్నికల్ టీం పనిచేస్తోందని అధికారులు వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>