కలం, వెబ్ డెస్క్ : తెలుగు తెరపై తనదైన ముద్ర వేసిన సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ. ఆయన కుటుంబం నుంచి వారసుడిగా వచ్చి పేరు నిలబెట్టాడు మహేశ్ బాబు. తండ్రి సూపర్ స్టార్ ట్యాగ్ ను సగర్వంగా తీసుకున్నాడు. ఈ సూపర్ స్టార్ లెగసీని మహేశ్ తర్వాత ఆయన తనయుడు గౌతమ్ (Gautham Ghattamaneni ) తీసుకెళ్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. గౌతమ్ అరంగేట్రంపై ఇప్పటికే చాలాసార్లు మీడియాలో చర్చ జరిగింది. అయితే తాజాగా ఈ డిస్కషన్ మరోసారి తెరపైకి వచ్చింది.
గౌతమ్ ప్రస్తుతం తన చదువులతో పాటు యాక్టింగ్ కోర్సు చేస్తున్నాడు. నటనలో శిక్షణ తీసుకుంటున్న గౌతమ్ అరంగేట్రం కోసం అన్ని విధాలా సిద్దమవుతున్నాడు. అయితే ఇప్పుడే గౌతమ్ ను హీరోగా చేయడంపై మహేశ్ ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. ఆయన నుంచి గౌతమ్ ఎంట్రీపై ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే ఇండస్ట్రీలో మాత్రం ఇద్దరు ప్రొడ్యూసర్స్ గౌతమ్ ను పరిచయం చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
మహేశ్ ను రాజకుమారుడు చిత్రంతో పరిచయం చేసిన నిర్మాత అశ్వనీదత్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయనే తన వైజయంతీ మూవీస్ బ్యానర్ లో గౌతమ్ ను ఇంట్రడ్యూస్ చేసే అవకాశాలున్నాయి. ఇక తాజాగా నిర్మాత అనిల్ సుంకర కూడా ఈ విషయంపై స్పందించారు. గౌతమ్ ను పరిచయం చేయాల్సిన అవకాశం వస్తే సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. అనిల్ కూడా సూపర్ స్టార్ కుటుంబానికి సన్నిహితుడు, కృష్ణ గారి వీరాభిమాని. బ్యానర్స్ రెడీగా ఉన్నా గౌతమ్ (Gautham Ghattamaneni ) మనసులో ఏముందో తెలియాల్సిఉంది.


