BRS నేతల ఒత్తిడితోనే బండి సంజయ్ కొడుకుపై కేసు: గంగుల

కలం, వెబ్ డెస్క్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడి విషయంలో బీఆర్ఎస్ భాధితురాలి పక్షాన ఉందని ఆ పార్టీ మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతల ఒత్తిడితోనే కేంద్ర మంత్రి కొడుకుపై కేసు నమోదు చేశారని అన్నారు. ఈ కేసును కులానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని.. ఇది కుల సమస్య కాదని, లా అండ్ ఆర్డర్ సమస్య అని పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్‌లో బండి సంజయ్ బెదిరింపు ధోరణిలో మాట్లాడారని మండిపడ్డారు. చట్టానికి, పోలీసులకు బండి సంజయ్ కుమారుడు సహకరించాలని చెప్పారు. ఈ అంశం ప్రజా సమస్య, శాంతి భద్రతల సమస్య అని పేర్కొన్నారు.

కొడుకును ఎందుకు అదుపులో పెట్టుకోలేదు?.. సత్యవతి రాథోడ్ ఫైర్

అంతు చూస్తామని బండి సంజయ్ బెదిరిస్తున్నారని.. బండి సంజయ్ తన కొడుకును ఎందుకు అదుపులో పెట్టుకోలేదు? అని బీఆర్ఎస్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రే హోంమంత్రిగా ఉన్నారని.. అమ్మాయి కేసు పెడితే ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని దుయ్యబట్టారు. కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి కొడుకు అని కేసును నీరుగార్చుతున్నారని ఆరోపించారు. బండి సంజయ్ గాలిమాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బండి సంజయ్‌ను కొనసాగించడం ద్వారా ప్రజలకు బీజేపీ పార్టీ ఎలాంటి మెసేజ్ ఇస్తుంది? అని ప్రశ్నించారు. బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>